కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. గతంలో 'లియో' సినిమా సమయంలో నటి త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి సినీ పరిశ్రమ ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చిరంజీవి, ఖుష్బూ వంటి ప్రముఖులు త్రిషకు మద్దతుగా నిలవగా, మన్సూర్ వారిపై పరువు నష్టం దావా వేసి రివర్స్‌లో కోర్టు నుంచి లక్ష రూపాయల జరిమానా ఎదుర్కొన్నారు. తమిళనాడు ఎన్నికల ఫలితాల అనంతరం విజయ్ విజయం సాధించడంతో మన్సూర్ అలీ ఖాన్ ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించారు. విజయ్‌ను వెంటనే ముఖ్యమంత్రిని చేయాలని ఆయన గవర్నర్‌ను కోరారు. ఈ విషయంలో ఎలాంటి ఆలస్యం చేయవద్దని, రాష్ట్రంలో పరిస్థితులు సక్రమంగా లేవని చెబుతూ విజయ్‌ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అశాంతికి తావివ్వకుండా తక్షణమే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.చాలా సినిమాల్లో విలన్ పాత్రలు చేసిన మన్సూర్ ఎక్కువగా రేప్ సీన్స్‌లో నటించానని తెలిపారు. విజయ్ హీరోగా వచ్చిన లియో మూవీలో త్రిషతోను రేప్ సీన్ ఉంటుందని అనుకున్నానని వివాదాస్పద కామెంట్స్ చేశారు. దాంతో త్రిష ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఇప్పుడు విజయ్‌కు సపోర్ట్ చేస్తూ కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.