ప్రధాని మోదీ నేడు హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసంతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లనున్నారు. ఈ భేటీలో తెలంగాణ రాజకీయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. 2029లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బీజేపీ.. టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మోదీ టీడీపీ అధినేతను కలవనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.