Current Date: 15 Jul, 2026

విశాఖ మత్స్యకార కుటుంబాలకు వైఎస్ జగన్ రూ.49 లక్షల ఆర్థిక సాయం

విశాఖపట్నం తీరంలో జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన మత్స్యకార కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొండంత అండగా నిలిచారు. ప్రమాదంలో తమ కుటుంబ పెద్దను కోల్పోయి వీధిన పడిన 6 బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించి, వారికి ధైర్యాన్ని నింపారు. పార్టీ తరపున మానవతా దృక్పథంతో స్పందిస్తూ, బాధితుల పక్షాననిలబడి మొత్తం రూ. 49 లక్షల భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించి, బాధిత కుటుంబాల్లో కొత్త భరోసాను నింపారు.  ​ఈ ప్రమాదంలో మరణించిన ఆరు మంది మత్స్యకారుల కుటుంబాలకు రూ. 7 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు. అదేవిధంగా, ఈ ఘోర ప్రమాదం నుండి తృటిలో ప్రాణాలతో బయటపడిన మత్స్యకారుడు 'చిన్నా'ను కూడా వైఎస్ జగన్ ప్రత్యేకంగా అక్కున చేర్చుకున్నారు. మానసికంగా, శారీరకంగా కుంగిపోయిన చిన్నా భవిష్యత్తుకు పూర్తి భరోసా కల్పిస్తూ, అతనికి కూడా రూ. 7 లక్షల ప్రత్యేక సహాయాన్ని అందించి తన ఉదారతను చాటుకున్నారు. వైఎస్ జగన్ అధికారంలో లేకపోయినా ప్రతిపక్ష నేతగా ముందుకొచ్చి పెద్ద మొత్తంలో సాయం చేయడంపై మత్స్యకార వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.