Current Date: 10 May, 2026

రేపు అల్పపీడనం.. రెండు రోజులు భారీ వర్షాలు

AP: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు, కోస్తాంధ్ర తీరం దిశగా పయనించి ఈనెల 13 తర్వాత వాయుగుండంగా మారుతుందని తెలిపింది. దీని ప్రభావంతో 14, 15 తేదీల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వాయుగుండం తుఫానుగా మారే అవకాశమూ ఉందని పేర్కొంది. కాగా ఇవాళ పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి.