Current Date: 28 Aug, 2026

ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు మంచినీరు ఇవ్వండి మహాప్రభో..

నకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోనల్లరాయి క్వారీలు, ఇసుక తవ్వకాలు వలన భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలన్నింటికీ 
వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీళ్లు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రోలుగుంటలో   ఖాళీ బిందెలతో ప్రదర్శన నిర్వహించారు.  మండలంలో రోలుగుంట, నిండుగొండ, కే. నాయుడుపాలెం, కొవ్వూరు,ఎన్ కొత్తూరు, అంట్లపాలెం, రాజుపేట, మునిపల్లి,గొల్లపేట గ్రామాలను ఫ్లోరైడ్  ప్రభావిత గ్రామాలుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ గ్రామాల్లో నివసిస్తున్న 20 వేల మంది జనాభా కు రక్షిత తాగునీరు అందించడానికి 2004 సంవత్సరంలో 3 కోట్ల 50 లక్షల  రూపాయలతో భారీ ప్రాజెక్టు నిర్మాణం చేశారు. ఈ నిధులతో జానకిరాంపురం గ్రామం వద్ద వరాహ నదిలో 3 భారీ బోరు బావులు తవ్వించారు.అక్కడినుండి రోలుగుంట లో లక్ష లీటర్లు సామర్థ్యం ఉన్న భారీ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసి పైప్ లైన్ ద్వారా అందించారు. ఈ పథకం ప్రారంభించి కొద్ది రోజులు సక్రమంగా పనిచేసింది.  వరాహ నది బోరుబావులు చుట్టూ, ఇసుక మాఫియా తవ్వడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. దీంతో గ్రామాలకు నీరు సరఫరా బంద్ అయిపోయింది.  అమృత ధార ( జల్జీవన్ మిషన్)2020-21 ద్వారా ఆరు కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయి. ఆ నిధులు పనులు చేపట్టకపోవడంతో కూటమి ప్రభుత్వం వచ్చి వాటిని రద్దు చేసింది. నేటికీ ఫ్లోరిడ్ గ్రామాలు గా గుర్తించి 23 సంవత్సరాలు అవుతుంది. పాత పైపులు పగిలిపోయాయి. అధికారులు అప్పులు చేసుకొని రిపేర్ చేస్తున్నారు. గ్రామంలో సొంత బోర్లు తీసుకున్న నీరు రావడం లేదు. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు ప్రతి గ్రామానికి రక్షత మంచినీరు సౌకర్యం కల్పిస్తామని  చెప్తున్నారు. కనీసం మండల కేంద్రంలో రోలుగుంటలో సైతం మంచినీరు సరఫరా చేయకపోవడం చాలా అన్యాయం. ఇటీవల 12 కుటుంబాలు సొంతంగా బోరు తీసుకోవడం జరిగింది. నీరు పడలేదు. లక్షల రూపాయలు ఖర్చులు అవుతున్న నీరు రావడం లేదు.  రోలుగుంట, నిండుగొండ, కొవ్వూరు, రెవిన్యూ పరిధిలో 12 నల్లరాయి క్వారీలు ఉన్నాయి. పర్యావరణ అనుమతులు  కోసం గ్రామసభలు పెట్టేటప్పుడు గ్రామాలకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం. మొక్కలు నాటుదాం. పర్యావరణాన్ని కాపాడుతాం. మెడికల్ క్యాంప్ పెడతాం అంటూ సభలో ప్రకటిస్తున్నారు. ప్రభుత్వ వైఖరికి  నిరసనగా మంచినీటి కోసం ఖాళీ బిందెలతో రోలుగుంటలో ప్రదర్శన నిర్వహించారు.