విశాఖలో డీప్ ఇన్నోవేషన్ సదస్సును ప్రారంభించిన సీఎం.. టెక్నాలజీ వల్ల పారదర్శకత, జవాబుదారితనం పెరుగుతుందని, వ్యవసాయంలో సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ప్రస్తుతం డీప్ టెక్నాలజీ సరికొత్త ఆవిష్కరణ అని చెప్పారు. ఏపీని నాలెడ్జ్ హబ్ గా మారుస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. అభివృద్దికి అనుగుణంగా టెక్నాలజీని వాడుకోవాలని, మొబైల్ చేతిలో ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చని చంద్రబాబు అన్నారు. నేషనల్ కాంక్లేవ్ ఆన్ టెక్ ఇన్నోవేషన్ సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది. షేపింగ్ ది నెక్స్ట్ ఎరా ఆఫ్ గవర్నెన్స్ కాన్సెప్ట్ తో సదస్సు నిర్వహిస్తున్నారు. ఆయా అంశాలపై 5 సెషన్లుగా నిపుణులతో చర్చలు జరగనున్నాయి.