Current Date: 12 Mar, 2025

విశాఖ పోర్టులో లాభాలు వస్తుంటే హాస్పటల్ ప్రైవేటీకరణ చేస్తారా... సిఐటియు జిల్లా కార్యదర్శి బి జగన్

పోర్టులో ఈ సంవత్సరం ఇప్పటివరకు రూ.725 కోట్లు లాభాలు వస్తుంటే హాస్పిటల్ ప్రైవేటీకరణ చేస్తున్నారని సిఐటియు జిల్లా కార్యదర్శి బి జగన్ మండి పడ్డారు. పోర్టు హాస్పిటల్‌ను ప్రైవేటీకరించాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, పోర్టు హాస్పిటల్ వద్ద చేపట్టిన నిరసన దీక్ష శనివారానికి 68వ రోజుకి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ లాభాలు రావడానికి కార్మికుల శ్రమ కీలకం అని చెప్పారు. జి వీ ఎం సి కీ సంవత్సరానికి సగటున 65 కోట్ల రూపాయల ఆస్తి పన్ను కట్టడం జరుగుతుందని, ఆ డబ్బులతో విశాఖ నగరం రోడ్లు కాలువలు అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. నగర అభివృద్ధికి ఉపయోగపడే పోర్టు, హాస్పటల్ ప్రైవేటు వరకు దారాదత్తం చేయడం విశాఖ అభివృద్ధిని నివారిస్తుందన్నారు. పోర్టు హాస్పిటల్ అభివృద్ధి కార్మికుల కృషితోనే సాధ్యమైందని, సుమారు 40 వేల మంది కార్మికుల ఆరోగ్యానికి సంబంధించిన సేవలను ప్రైవేట్ వారికి అప్పగించడం అనర్హమని తెలిపారు. 

Share