వైసీపీ అధినేత జగన్ చుట్టూ కోటరీ ఉందని... ఆ కోటరీ వల్లే తాను జగన్ కు దూరమయ్యానని మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కోటరీని దూరం పెట్టకపోతే జగన్ కు భవిష్యత్తు ఉండదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పందిస్తూ విజయసాయిపై సెటైర్లు వేశారు. వైసీపీలో ఉన్నప్పుడు ఢిల్లీలో ఆయన మాట్లాడిన మాటలకు... ఇప్పుడు విజయవాడలో మాట్లాడిన మాటలకు ఎక్కడా పొంతన లేదని విమర్శించారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ప్రజలేనని చెప్పారు. అయినా ఏ పార్టీలో కోటరీ ఉండదో చెప్పండని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు చుట్టూ కోటరీ లేదా? అని అడిగారు. మొన్నటి వరకు కోటరీలో ఉన్న మనమే... ఇప్పుడు కోటరీ గురించి మాట్లాడితే ఎలాగని అన్నారు. ఒకరి మీద ప్రేమ పుట్టినప్పుడు.. మరొకరిపై ప్రేమ విరిగిపోతుందని చెప్పారు. ఇప్పుడు విజయసాయికి ఎవరి మీద ప్రేమ పుట్టిందో తెలియదని వ్యాఖ్యానించారు. పార్టీ మారిన వ్యక్తి నుంచి ఇంతకంటే ఏం ఆశిస్తామని అన్నారు.
Share