Current Date: 14 Mar, 2025

చేతి వేలిని కొరికిన చేప.. అరచెయ్యి పోయింది!

కేరళలో ఓ రైతు తన పొలంలోని చెరువుని శుభ్రం చేసుకుంటూ ఉండగా.. ఓ చిన్న చేప అతని కుడి చేతి వేలిని కొరికింది. సాధారణంగా ఇలా చేప కొరకడాన్ని మనం అంత సీరియస్‌గా తీసుకోం. కానీ.. సదరు రైతు ఆ చేప కొరకడంతో తన కుడి అరచేతిని కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. కేరళలోని కన్నూర్‌ జిల్లాకు చెందిన రాజేశ్‌ గత ఫిబ్రవరిలో చెరువును శుభ్రం చేస్తుండగా..‘కడు’ రకం చేప అతడి కుడి చేతి వేలిని కొరికింది. దాంతో అతను పెద్దగా పట్టించుకోలేదు. అయితే.. రోజులు గడుస్తున్నా.. గాయం తగ్గకపోగా అరచేతిపై బొబ్బలు వచ్చాయి. డాక్టర్ల వద్దకు వెళితే.. పరీక్షలు నిర్వహించి ‘గ్యాస్‌ గ్యాంగ్రీన్‌’ అనే బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ సోకినట్లు తేల్చారు. ఈ ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత దాని నుంచి బయటపడాలంటే వ్యాధి వ్యాపించిన భాగాన్ని తొలగించడం తప్ప మరో మార్గం లేదు. దాంతో తొలుత చేతివేళ్లను ఆ తర్వాత అరచేతిని తొలగించాల్సి వచ్చింది. కేరళలో ఈ వ్యాధి ఇప్పటి వరకూ ఇద్దరికి మాత్రమే సోకిందట.

Share