బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తాను గౌరీ స్ప్రాట్‌తో డేటింగ్ లో ఉన్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈరోజు అమీర్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాడు. ఈ వయసులో అమీర్ డేటింగ్ గురించి ప్రకటించి అందర్నీ సర్‌ప్రైజ్ చేశాడు.2 దశాబ్దాలుగా తాము స్నేహితులుగా ఉన్నామని.. గడిచిన ఏడాదిగా కాస్త గట్టిగా క్లోజ్ అయ్యామని అమీర్ చెప్పుకొచ్చాడు. వాస్తవానికి గౌరీ స్ప్రాట్ ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. ఆమెది తమిళనాడు.. ఐర్లాండ్ దేశానికి చెందిన తన భర్తతో కొన్నేళ్ల కిందట విడిపోయింది. ఇప్పుడు ఆరేళ్ల కొడుకు గౌరీతోనే ఉంటున్నాడు.1986లో రీనా దత్తాను అమీర్ పెళ్లి చేసుకుని.. 2002లో విడాకులిచ్చారు. ఆ తర్వాత కిరణ్ రావును పెళ్లి చేసుకుని 16 ఏళ్ల కాపురం తర్వాత 2021లో ఆమెకు కూడా విడాకులిచ్చారు. ఇప్పుడు లేటు వయసులో గౌరీకి కనెక్ట్ అయ్యారు.
Share