Current Date: 14 Mar, 2025

పంత్ సోదరి వివాహ వేడుక.. పాట పాడిన‌ ధోనీ దంప‌తులు...

టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్‌ పంత్ సోదరి సాక్షి వివాహ వేడుకలకు భారత మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్‌ ధోనీ దంప‌తులు, మాజీ ప్లేయ‌ర్‌ సురేశ్‌ రైనా హాజరయ్యారు. ఈ వేడుక ముస్సోరీలోని ది స‌వాయి హోటల్‌లో జరిగింది. బిజినెస్ మెన్‌ అంకిత్ చౌదరితో పంత్ సోదరి వివాహం జ‌రిగింది. ఇక ఈ వివాహ వేడుక కోసం ధోనీ తన భార్య సాక్షితో కలిసి మంగళవారం సాయంత్రమే ముస్సోరీ చేరుకున్నాడు.  మెహందీ, సంగీత్ వేడుకలలో ధోనీ దంప‌తులు సంద‌డి చేశారు. ఇక ఈ పెళ్లిలో ధోనీ, రైనాతో పాటు టీమిండియా ప్ర‌స్తుత‌ హెడ్ కోచ్ గౌతం గంభీర్ కూడా సంద‌డి చేశారు.

Share