రాజకీయాల్లో ఆయనది ఒక చరిత్ర. ఎన్నో అటుపోట్లు తిని పైకి ఎదిగారు. ఎన్నో దెబ్బలు తిన్న తర్వాత తనను తాను ఓ శక్తిగా మలచుకున్నారు. వైసీపీ నేతలు ఎంతగానో విమర్శించినా తాను నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం ముందుకు కదిలారు. ఆయన మరెవరో కాదు కొణిదెల పవన్ కల్యాణ్. ఎంతోమంది తనను రాజకీయాలు వదిలేయమని అన్నారు. కానీ అతను మాత్రం ముందుకు కదిలారే కాని వెనక్కు తగ్గలేదు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు లాగా మొక్కవోని ధైర్యంతో ముందుకు కదిలారు. అలా 2014 మార్చి 14వ తేదీన జనసేన పార్టీని సినీనటుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. హైదరాబాద్ నగరం మాదాపూర్ ప్రాంతంలోని హైటెక్ సిటీ సమీపంలో ఓ హోటల్‌లో పవన్ కల్యాణ్ ఆవిర్భావ సభ నిర్వహించారు. ఓటు హక్కు లేని వారిని పవన్ నమ్ముకున్నారని పలువురు వైసీపీ నేతలు విమర్శించారు. వారినే ముందు ఉంచి జనసేన పార్టీని తిరుగులేని శక్తిగా పవన్ కల్యాణ్ ముందుకు నడిపించారు. 2014 నుంచి 2025 వరకు ఎన్నో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా పవన్ కల్యాణ్ నిలిచారు. దాదాపు పన్నెండేళ్ల ప్రస్థానంలో ఎంతోమంది పవన్ కల్యాణ్‌ను విమర్శించారు. ఇప్పుడు వారందరితో శెభాష్ పవన్ కల్యాణ్ అనిపించుకుంటున్నారు.
Share