Current Date: 14 Mar, 2025

అయ్యో పాపం.. సునీతా విలియ‌మ్స్‌కు తప్పని నిరీక్షణ

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ గత 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకున్నారు. అందరూ ఆమె తిరిగి రావాలని ఎదురు చూస్తుండగా, మరో దుర్వార్త వెలువడింది. నిజానికి, స్పేస్‌ఎక్స్ అంతరిక్షంలో చిక్కుకున్న నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపాలని ప్లాన్ చేసింది. ఈ సిబ్బందిని పంపిన తర్వాతే, సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి తీసుకువరావలని భావించారు. ఈ బృందం మార్చి12న బుధవారం పంపాల్సి ఉంది. కానీ రాకెట్ లాంచ్‌ప్యాడ్‌లో చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో, స్పేస్‌ఎక్స్ క్రూ-10 ప్రయోగాన్ని రద్దు చేసింది. కానీ బోయింగ్ స్టార్‌లైనర్‌లో పనిచేయకపోవడం వల్ల, వారిద్దరూ అంతరిక్షంలో చిక్కుకుపోయారు. స్పేస్‌ఎక్స్ క్రూ-10 ప్రయోగ సమయంలో అధికారులు మిషన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Share