Current Date: 14 Mar, 2025

శ్రేయస్ అయ్యర్ బలుపు... ఈ ఎక్సట్రాలే తగ్గించుకుంటే మంచిదంటూ నెటిజన్ల ఆగ్రహం

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025‌లో అయ్యర్ అసాధారణ బ్యాటింగ్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలోనే భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అయితే విజయానంతరం ఐసీసీ ఛైర్మన్ జైషా మెడల్స్ ప్రధానం చేయగా.. బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ భారత ఆటగాళ్లకు వైట్ జాకెట్స్ తొడిగాడు. ఈ వైట్ జాకెట్స్ స్వీకరించడానికి వరుణ్ చక్రవర్తీ ముందు వచ్చాడు. ఆ తర్వాత ఒక్కో ప్లేయర్ రాగా.. బీసీసీఐ ప్రెసిడెంట్ స్వయంగా ఆటగాళ్లకు జాకెట్స్ తొడిగాడు. అయ్యర్ మాత్రం బీసీసీఐ బాస్ చేతి జాకెట్ తొడిగించడానికి నిరాకరించాడు. బీసీసీఐ పెద్దల ముందు కాస్త యాటిట్యూడ్ చూపించాడు. దాంతో బిన్నీ జాకెట్‌ను అయ్యర్ భుజాలపై కప్పగా.. అతను ముందుకొచ్చి వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా.. బీసీసీఐ పెద్దల ముందు అయ్యర్ తన బలుపు చూపించాడని, ఈ ఎక్స్‌ట్రాలే తగ్గించుకోవాలని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు.

Share