టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద గురువారం రాత్రి అలజడి నెలకొంది. దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు తమ కుటుంబసభ్యులతో కలిసి గురువారం రాత్రి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఆవరణలో వేచి ఉండడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గత కొంత కాలంగా దువ్వాడ కుటుంబంలో అంతర్గత విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఇంటి ఆవరణలో చోటుచేసుకున్న ఘటనతో ఒక్కసారిగా అలజడి నెలకొంది.