అక్కినేని నాగచైతన్య పెళ్లికి రెడీ అవుతుంటే సడన్‌గా అక్కినేని అఖిల్ నిశ్చితార్థం చేసుకున్నాడు. కనీసం ఎవరూ ఊహించని విధంగా సలెంట్గా అఖిల్ తన ఎంగేజ్ మెంట్ విషయాన్ని ప్రకటించాడు. అటు అక్కినేని నాగార్జున కూడా ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాడు. జైనాబ్ రౌజీ అనే అమ్మాయితో అఖిల్ ఎంగేజ్ మెంట్ జరిగింది. వీళ్లిద్దరూ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారట. వాస్తవానికి డిసెంబర్ 4న హీరోయిన్ శోభిత ధూళిపాళ్లని నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్నాడు. ఓవైపు అంతా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారని భావిస్తున్న టైమ్ లో చిన్న కొడుక్కి ఎంగేజ్ మెంట్ పూర్తి చేశారు నాగార్జున సరిగ్గా ఏడేళ్ల కిందట నాగచైతన్య, సమంత పెళ్లి టైమ్‌లోనే అఖిల్‌కి కూడా ఇలానే ఎంగేజ్ మెంట్ జరిగింది. కానీ.. కొన్ని రోజులకే ఆ ఎంగేజ్‌మెంట్‌ను అక్కినేని అఖిల్ రద్దు చేసుకున్నాడు. సరిగ్గా ఇప్పుడు కూడా.. ఓవైపు నాగచైతన్య, శోభిత పెళ్లికి రెడీ అవుతున్న వేళ.. అఖిల్ ఎంగేజ్ మెంట్ జరిగింది. దాంతో మళ్లీ ఏం జరుగుతుందో అని అక్కినేని అభిమానులు కంగారుపడుతున్నారు.
Share