Current Date: 27 Nov, 2024

శ్రీలీలకి లక్కీ ఛాన్స్.. ఒక్క సాంగ్‌కి రూ.2 కోట్లు రెమ్యూనరేషన్

పుష్ప 2 సినిమా డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కాబోతోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలుండగా.. ఈ మూవీలో ఒక్క పాటకు డ్యాన్స్ చేసినందుకు హీరోయిన్ శ్రీలీలకు వచ్చిన పారితోషికం రెండు కోట్లు అని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. వాస్తవానికి శ్రీలీల రెగ్యులర్ సినిమాకు తీసుకునే పారితోషికం కోటిన్నర వరకు ఉంటుందని టాక్. సాధారణంగా సినిమా చేయాలి అంటే కనీసం 60 రోజులు కాల్ షీట్లు ఇవ్వాలి. కానీ.. పుష్ప 2 ఐటెం సాంగ్‌కి శ్రీలీల కేటాయించిన రోజులు కేవలం 5-6 మాత్రమే. ఇటీవల ఆ ఐటెం సాంగ్ (కిస్సిక్ ) విడుదలవగా అందులో శ్రీలీల అందాల్ని ఆరబోస్తూ కనిపించింది.గత ఏడాది నుంచి వరుసగా శ్రీలలకి డిజాస్టర్స్ పడ్డాయి. దాంతో ఇప్పుడు ఆమె మరీ అంత బిజీగా లేదు. గత మార్చి వరకూ నెలకి ఒక సినిమా చొప్పున రిలీజ్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఆమె సినిమా వచ్చి ఏడు నెలలు అవుతోంది. కాబట్టి శ్రీలీల మూడు నాలుగు రోజులు డేట్స్ అడ్జస్ట్ చేయలేనంత బిజీగా అయితే లేదు. చేతిలో రెండు మూడు సినిమాలు వున్నాయి. ఒకటి ఆల్ మోస్ట్ పూర్తి కావచ్చింది. రెండు చేయాల్సి వుంది. 

Share