హీరో నాని నిర్మాతగా మారి చేసిన కోర్టు సినిమా మీద ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈరోజు విడుదలైన కోర్టు సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.ఊర్లో మంచి పేరు, పరపతి, రాజకీయ మరియు అధికార బలం ఉన్న వ్యక్తి మంగపతి (శివాజీ). తన కుటుంబానికి చెందిన జాబిలి (శ్రీదేవి) తక్కువ స్థాయికి చెందిన చందు (హర్ష్ రోషన్) అనే కుర్రాడిని ప్రేమిస్తుందని తెలుసుకొని.. అతడి మీద అబద్ధపు కేసులు, మరీ ముఖ్యంగా పోక్సో కేసు పెట్టి నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టిస్తాడు. ఆ కేసుల నుంచి చందు ఎలా బయటపడ్డాడు? అందుకు లాయర్ సూర్యతేజ (ప్రియదర్శి) ఎలా తోడ్పడ్డాడు? అనేది “కోర్ట్” సినిమా కథ ఎంగేజింగ్ కోర్ట్ రూమ్ డ్రామాలకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఆసక్తికరమైన వాదప్రతివాదనల్లో లోపాలు కనిపించాయి. అయినప్పటికీ శివాజీ పెర్ఫార్మెన్స్, సాయికుమార్ సెటిల్డ్ డైలాగ్స్, హర్ష్ రోషన్ క్యారెక్టర్ బిహేవియర్, రామ్ జగదీశ్ సెన్సిబిలిటీస్ “కోర్ట్”ను ఓ మంచి సినిమాగా నిలిపాయి.
Share