Current Date: 15 Mar, 2025

జడ్జి ఎదుట బోరున విలపించిన పోసాని.. మళ్లీ రిమాండ్

వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణ మురళికి బిగ్ షాక్ తగిలింది. సీఐడీ అధికారులు అతడ్ని జడ్జి ముందు హాజరుపర్చగా.. ఇరు వైపుల వాదనలు విన్న కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మార్చి 28వ తేదీ వరకు రిమాండ్‌లో పోసాని ఉండనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పోసానిపై కేసులు నమోదు అయ్యాయి. బెయిల్‌పై విడుదలైనా మళ్లీ ఏదో ఒక పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు పీటీ వారెంట్‌పై పోసాని కృష్ణ మురళిని తీసుకెళ్లే అవకాశం ఉందని రెండు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి పోసానికి మంగళవారం రాత్రి బెయిల్ వచ్చింది. బుధవారం విడుదల కావాల్సింది. కానీ.. మళ్లీ రిమాండ్ పడింది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో జడ్జి ఎదుట పోసాని తన గోడుని చెప్తూ బోరున విలపించారు. తన ఆరోగ్యం బాగాలేదని, రెండు సార్లు ఆపరేషన్‌ చేసి స్టంట్లు వేశారని కంటతడి పెట్టాడు. బెయిల్‌ రాకుంటే ఆత్మహత్యే శరణ్యమని జడ్జి ఎదుట వాపోయాడు.

Share