Current Date: 26 Nov, 2024

స్వయంగా టీ కాచిన సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపం 2.0 పథకాన్ని ప్రారంభించారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామంలో పర్యటించిన సీఎం చంద్రబాబు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారు. శాంతమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి గ్యాస్ సిలిండర్‌ పంపిణీ చేశారు. అనంతరం స్వయంగా గ్యాస్ వెలిగించి టీ పెట్టారు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యుల సంఖ్య, ఎంత మందికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని ఆరా తీశారు. తర్వాత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ తో కలిసి టీ తాగారు. 

Share