Current Date: 25 Nov, 2024

ప్రధాని మోడీ విశాఖ పర్యటన రద్దు

విశాఖ జిల్లాలో ఈ నెల 29న  ప్రధాని నరేంద్ర మోడీ  పర్యటన రద్దయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్ష సూచన నేపథ్యంలో మోడీ పర్యటన రద్దయినట్లు తెలిసింది. ఈ నెల 29న విశాఖ జిల్లా పర్యటన ఖరారైనట్లు ఆదివారం అధికారులు ప్రకటించడమే కాకుండా  సభ ఏర్పాట్లు, రోడ్డు షో నిర్వహణపై విశాఖపట్నం కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌  కలెక్టరేట్‌లో ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష కూడా నిర్వహించారు.   ఈ నెల 29న ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని, అదే వేదికపై నుంచి అనకాపల్లి జిల్లా పూడిమడకలోని ఎన్టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ శంకుస్థాపనతో పాటు కొన్ని రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులను జాతికి అంకితం చేయనున్నారని అధికారులు తెలిపారు.  అయితే ఆ రోజు భారీ వర్షం కురిసే అవకాశమున్నందున ప్రధాని పర్యటన రద్దయినట్లు తెలిసింది.

Share