Current Date: 26 Nov, 2024

హెరాయిన్‌కు బానిసైన యువతి ద్వారా 19 మందికి ఎయిడ్స్

ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో ఒకే అమ్మాయి ద్వారా 19 మంది అబ్బాయిలు ఎయిడ్స్ బారినపడినట్టు ‘ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ తన కథనంలో పేర్కొంది. 17 ఏళ్ల ఆ అమ్మాయి హెరాయిన్‌కు బానిసై డ్రగ్స్ కోసం తనకు సాయం చేసిన అబ్బాయిలతో శారీరక సంబంధం పెట్టుకుంది. ఫలితంగా ఆమె ద్వారా వారంతా ఎయిడ్స్ బారినపడ్డారు. ఇది కలవరపెట్టే ధోరణి అని, తాము చర్యలు తీసుకున్నట్టు జిల్లా వైద్యాధికారి ఒకరు తెలిపారు. అమ్మాయి అలవాటు ఈ విపత్కర పరిస్థితికి దారితీసినట్టు చెప్పారు. ప్రస్తుతం ఆమెకు కౌన్సెలింగ్ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. యువకులు అనారోగ్యం బారినపడడంతో ఆసుపత్రిలో చేరారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో వారికి హెచ్ఐవీ సోకినట్టు గుర్తించారు.నైనిటాల్‌లో ఒక్కసారిగా హెచ్ఐవీ కేసులు పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏడాదికి దాదాపు 20 హెచ్ఐవీ పాజిటివ్ కేసులను గుర్తిస్తున్నామని, కానీ, కేవలం 5 నెలల్లోనే 19 కేసులు వెలుగు చూడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని నైనిటాల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ హరీశ్ చంద్ర పంత్ తెలిపారు.

Share