Current Date: 26 Nov, 2024

విమానాలకు వరుస బాంబు బెదిరింపులపై కేంద్రం అలర్ట్.. ఎఫ్ బి ఐ, ఇంటర్‌పోల్ సాయం కోరిన భారత్

దేశంలో విమానాలకు వరుస బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. వీటి నియంత్రణకు భారత్ మరో నిర్ణయం తీసుకుంది. ఈ బాంబు బెదిరింపులు ఆగకపోవడంతో దర్యాఫ్తులో ఇంటర్ పోల్, ఎఫ్ బీఐ సాయం కోరింది భారత్. అక్టోబర్ 13 నుంచి 28వ తేదీలోపు 410 కిపైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. వీటి వెనుక అమెరికాలోని ఖలిస్తానీ గ్రూపుల హస్తం ఉందన్న అనుమానాలు భారత్ దర్యాఫ్తు బృందాల్లో ఉన్నాయి. అటు భారత్ విజ్ఞప్తికి అమెరికా ఎఫ్ బీఐ కూడా సానుకూలంగా స్పందించింది. ఈ బాంబు బెదిరింపులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయో ఆ ఈ మెయిల్స్ ను ట్రాక్ చేసేందుకు ఎఫ్ బీఐ సహకరించనుంది. అమెరికా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు భారత సిబ్బందితో టచ్ లో ఉన్నారు. ఈ బాంబు బెదిరింపుల వల్ల అమెరికా ప్రజలపైనా ప్రభావం చూపింది. దీంతో పన్ను బెదిరింపులపై దర్యాఫ్తు విషయంలో ఎఫ్ బీఐదే కీలక పాత్రగా మారనుంది.

Share