టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ మధ్య భారత్ నుంచి యూఎస్‌కు నడవాల్సిన 60 విమానాలను క్యాన్సిల్ చేసింది. నిర్వహణ సమస్యల కారణంగా విమానాలు అందుబాటులో లేకపోవడంతో ఆయా విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది. పీక్ ట్రావెల్ పీరియడ్‌లో రద్దయిన విమానాల్లో శాన్ ఫ్రాన్సిస్కో, చికాగో విమానాలు ఎక్కువగా ఉన్నాయి. ఎయిర్ ఇండియా గ్రూప్ ద్వారా నడుస్తున్న ఇతర విమానాల్లో తర్వాతి రోజులకు సర్వీస్‌ని ఆఫ్ చేసినట్లు సంస్థ తెలిపింది. ఎయిర్ ఇండియా మెయింటెనెన్స్ కోసం పంపుతున్న ఎంఆర్‌వో ఆపరేటర్ నుంచి విమానాలను తిరిగి పొందడంలో జాప్యం జరుగుతుంది. శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్, చికాగో, నెవార్క్, న్యూయార్క్‌కు వెళ్లాల్సిన 60 విమానాలను ఎయిరిండియా రద్దు చేసింది.
Share