ఏపీ అసెంబ్లీలో బుధవారం ప్రశ్నోత్తరాల్లో గందరగోళం చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక శాఖకు వచ్చిన ప్రశ్నలను వేరే శాఖలకు ఎలా పంపుతారని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలు, ఇళ్ల పంపిణీకి సంబంధించిన ప్రశ్న రెవెన్యూకు ఎలా వేస్తారన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా ఒకేరోజు మంత్రికి.. మండలి, అసెంబ్లీల్లో ఒకేసారి ప్రశ్నలు ఎలా వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి ఇటు అసెంబ్లీలో గోదావరి పుష్కరాల పనులపై ప్రశ్న వేశారు. అదే సమయంలో అటు మండలిలో గాలేరు నగరి, హంద్రీనీవా అనుసంధాన ప్రాజెక్టులపై ప్రశ్నించారు. ఉభయ సభల్లోనూ మంత్రికి ఒకే సమయంలో ప్రశ్నలు రావడంపై స్పీకర్ విస్మయం చెందారు.
Share