వచ్చే వారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నెల 24న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ‘ఎక్స్’లో వెల్లడిరచారు. ఈ నెల 25 నుంచి మొదలయ్యే పార్లమెంట్ సమావేశాలు డిసెంబరు 20న ముగుస్తాయి. ఈ క్రమంలో పాత పార్లమెంటు భవనంలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. మరోవైపు శీతాకాల సమావేశాల నేపథ్యంలో పార్లమెంటులో ఏర్పాట్లను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్వయంగా పరిశీలించారు.