Current Date: 20 Nov, 2024

ఏపీలో జనరిక్‌ ఔషధ విక్రయాలు 7 శాతమే మంత్రి సత్యకుమార్‌

వైద్యులు ఎక్కువగా జనరిక్‌ మందులను సిఫార్సు చేయకపోవడం వల్లే ప్రజల్లో అవగాహన తక్కువగా ఉందని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెల్లడిరచారు. మొత్తం 560 రకాల జనరిక్‌ మందులను వినియోగించేందుకు వీలుగా కార్యాచరణను చేపట్టామని తెలిపారు. జనరిక్‌ మందుల నాణ్యత, ప్రమాణాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తామన్నారు. బ్రాండెడ్‌ మందులు, జనరిక్‌ ఔషధాలకు ఎలాంటి తేడా లేదని మంత్రి చెప్పారు. ప్రస్తుతం ఏపీలో 215 జనరిక్‌ ఔషధ కేంద్రాలు మాత్రమే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 2.15 లక్షల కోట్ల ఔషధాల విక్రయాలు జరుగుతుండగా వాటిలో జనరిక్‌ ఔషధ విక్రయాలు 7శాతం మాత్రమే ఉన్నాయన్నారు. ఈ అంశంపై బుధవారం శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.

Share