అనకాపల్లి జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, పెందుర్తి ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు, ఎంఎల్ సి దువ్వా రపు రామారావు లతో కలిసి శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకు న్నారు. వీరికి ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎన్. ఆనందకుమార్ ప్రోటో కాల్ ఏఈఓ వి .రాంబాబు, పర్యవేక్షణాధికారి విక్రమ్, పిఆర్ఓ నాయుడు, ఆలయ ప్రధాన అర్చకులు రమణాచార్యులు, వేద పండితులు నాదస్వర వేదమంత్రాలతో స్వాగతం పలికారు. ముందుగా స్వామివారి కప్ప స్తంభము ఆలింగనం చేసుకున్నా రు. ఆ తదుపరి నాదస్వరాలు, వేదమంత్రాలతో బేడా మండపం ప్రదక్షిణ కావించా రు. స్వామివారి అంతరాలయ దర్శనం అనంతరం వేద పండితులచే వేద ఆశీర్వచ నం ఇచ్చి, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఆనంద్ కుమార్ స్వామివారి చిత్రపటం ప్రసాదాలను బహుకరించారు.
Share