ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులకు ప్రభుత్వ గృహాలు మంజూరు చేయాలని కోరుతూ ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన పలువురు తెలుగు యువత నాయకులు శనివారం నాడు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని కలసి వినతి పత్రం అందజేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కేవలం గిరిజనులకు మాత్రమే ప్రభుత్వం గృహాలు మంజూరు చేస్తోందని
ఎన్నో ఏళ్ల నుంచి ఆ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న తమను అనర్హులుగా చెబుతూ గృహాలు మంజూరు చేయడం లేదన్నారు. గిరిజనేతరులకు కూడా ప్రభుత్వ గృహాలు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ ఈ విషయంపై అధికారులతో చర్చించి సాధ్యాసాధ్యానాలు పరిశీలించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తెలిపారు.
Share