ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 43 మంది జగన్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. పనులు చేసి డబ్బులు రాకపోతే అప్పులు చేసి, బ్యాంక్‌లు అప్పులు ఇవ్వక చనిపోయారన్నారు. ఈ భూమి మీద జగన్ అనే వ్యక్తి ఉన్నత కాలం ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుందంటూ వ్యాఖ్యలు చేశారు. ‘‘1983 నుండి నేను కాంట్రాక్టు చేస్తున్నాను. ఇంత దుర్మార్గమైన, రాక్షస రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, జగన్ ప్రభుత్వం దగ్గర చేయలేదు. జగన్ పెట్టిన బాధలకు నేను అయితే 10 సార్లు సూసైడ్ చేసుకోవాలి. ఐదు సార్లు హార్ట్ ఎటాక్ వచ్చి బ్రతికిన వ్యక్తిని. ఈ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు అసెంబ్లీ కి వస్తాడా అని ఎదురు చూస్తున్న పిలిపించండి. 2019-24 వరకు రాక్షస పాలన జరిగిందంటూ విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Share