బడి కోసం ఈ ఏరు దాటాల్సిందే అన్న శీర్షిక న లీడర్ వరల్డ్ న్యూస్ వెలుగులోకి తెచ్చిన వార్త ఎట్టకేలకు జిల్లా యంత్రాంగాన్ని కదిలించింది. లీడర్ వార్త కు అల్లూరి జిల్లా కలెక్టర్ స్పందించడంతో అనంతగిరి మండల మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కే. బాలాజీ తెంగిల్ బంధం గ్రామాన్ని సందర్శించారు. ఒకటి నుండి అయిదవ తరగతి వరకూ చదివే సుమారు 25 మంది పిల్లలు ఈ గ్రామంలో వున్నారు. వీళ్ళు తెంగిల్ బంధం నుండి గంగవరం ఎంపీపీ స్కూల్ కి వెళ్లాలంటే రెండున్నర కిలోమీటర్లు నడవడమే కాదు మధ్యలో రెండు సెలయేర్లు దాటాలి. కానీ ఈ పసివాళ్ళు ఎలా ఈ సెలయేర్లను దాటి వెళ్ళగలరు? ఈ విషయాన్ని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే. గోవిందరావు లీడర్ దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన లీడర్ దీనిపై ప్రత్యేక కధనాన్ని యూట్యూబ్ ద్వారా రూపొందించింది. ఇది కలెక్టర్ దృష్టికి వెళ్లడం తో అధికారులు ఈ గ్రామాన్ని చేరుకొని వాస్తవాలను తెలుసు కున్నారు. ఇక్కడ పాఠశాల ఏర్పాటు చేసేంత వరకూ గంగవరం నుంచి ఒక టీచర్ ను పంపడానికి నిర్ణయించారు. అయితే తెంగిల్ బంధం లో పాఠశాల నిర్వహణకు షెడ్ కావలసి వుంది. దీన్ని ప్రభుత్వమే నిర్మించాలి అని ఈ ఆదివాసీ గ్రామస్థులు కోరుతున్నారు.
Share