తిరుమల పుణ్య క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంటుంది.. దీంతో భక్తులు దర్శనం కోసం క్యూల్లో గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్న సంగతి తెలిసిందే.. అంతేకాదు.. గదుల కొరత కూడా ఉండడంతో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయ పరిసరాల ఆవరణలోనే గడుపుతూ ఉంటారు. ఈ నేపధ్యంలో శ్రీవారి భక్తులకు గదుల కొరతని తీర్చనుందని తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో గదుల కొరత తీరనుందని వెల్లడించింది. తిరుమలలో కొత్తగా యాత్రికుల వసతి సముదాయం భవనాన్ని టీటీడీ నిర్మిస్తోంది. ఈ భవన నిర్మాణ పనులపై టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అధికారులకు ఈ భవన నిర్మాణ పనులకు ప్రతి ఒక్క పనికి గడువు పెట్టుకుని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అడిషనల్ ఈవో ఆదేశించారు. భవనంలో భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీ పడవద్దు అని అధికారులకు చెప్పారు.
Share