Current Date: 05 Oct, 2024

ప్రభాస్ కోసం పాక్ నుంచి హీరోయిన్.. క్రేజీ న్యూస్

రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా 'సలార్', 'కల్కి 2898 AD' విజయాలతో మంచి జోష్‌లో ఉన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇందులో ప్రభాస్ జోడీగా పాకిస్తానీ హీరోయిన్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ నటి సజల్ అలీని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ప్రభాస్ తో ఓపీరియడ్ యాక్షన్ డ్రామా చేస్తున్నానని, ఇదొక హిస్టారికల్ ఫిక్షన్ మూవీ అని డైరెక్టర్ హను రాఘవపూడి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.ఇది యుద్ధ నేపథ్యంలో సాగే డిఫెరెంట్ లవ్ స్టోరీ అని, ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందుజరిగే కథను చెప్పబోతున్నారని టాక్ నడిచింది. ఇందులో ప్రభాస్ బ్రిటీష్ సైనికుడి పాత్రలో కనిపిస్తారనే రూమర్ కూడా వినిపించింది. ఈ క్రమంలో సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఓ పాన్ ఏషియన్ నటిని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. దీని కోసం సజల్ అలీని సంప్రదిస్తున్నట్లుగా చెబుతున్నారు. పాక్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో సజల్ అలీ ఒకరు. 2017లో 'మామ్' అనే హిందీ సినిమాతోభారతీయ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. దివంగత శ్రీదేవి ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ, సజల్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

Share