Current Date: 27 Nov, 2024

కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లడంపై సస్పెన్స్.. నో ఆప్షన్స్!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నుంచి షురూ కానున్నాయి. ఈ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. గత ఏడాది ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ప్రమాదవశాత్తు పడిపోయి చాలా రోజులు బెడ్‌కే పరిమితైన కేసీఆర్.. అనంతరం బయట కూడా ఎక్కువగా కనిపించడం లేదు. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా కేసీఆర్ అసెంబ్లీ హాజరవుతారని బీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఈరోజు నుంచి తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే అసెంబ్లీకి వెళ్లాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.  ఎన్నికలు తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ రాలేదు. దాంతో కేటీఆర్, హరీశ్ రావులే సభలో కాంగ్రెస్ పార్టీ సభ్యులకు తగు సమాధానం చెప్పారు. అయితే ఈ సారి మాత్రం జరిగే సమావేశాలకు చాలా మంది కాంగ్రెస్ వైపు మళ్లారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కు ఎమ్మెల్యే బలం కూడా చాలా తగ్గుతోంది. దాదాపు 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉండగా.. పార్టీ మనుగడలో ఉండాలంటే అసెంబ్లీలో వాయిస్‌ను బలంగా వినిపించాల్సిన పరిస్థితి ఉంది.  కాబట్టి కేసీఆర్ వెళ్లక తప్పదు.

Share