Current Date: 05 Oct, 2024

Union Minister Nirmala Sitharaman's sleeping partner joke!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎంత చమత్కారంగా మాట్లాడతారో మనందరికీ తెలుసు. బీజేపీలోని కీలక నేతల్లో ఒకరైన ఆమె.. ఎన్నికల జరుగుతున్న సమయంలో స్టాక్ బ్రోకర్లతో మాట్లాడి నవ్వులు పూయించారు. దేశంలో ఇప్పటి వరకు నాలుగు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఇంకా మూడు దశల్లో ఓటింగ్ జరగాల్సి ఉంది. ఈ తరుణంలో రియల్ ఎస్టేట్ లావాదేవీలతో పాటు స్టాక్ మార్కెట్ బ్రోకర్లపై విధించే పన్నులపై అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పిన సమాధానం అందర్నీ ఆలోచించజేస్తోంది.

బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్‌ను స్టాక్ మార్కెట్ లావాదేవీలతో పాటు ఇల్లు కొనుగోలుపై ప్రభుత్వం విధించే పన్నుల గురించి స్టాక్ బ్రోకర్ అడిగారు. తాను డబ్బును పెట్టుబడి పెట్టడంతోపాటు నష్టాలను కూడా భరిస్తున్నానని, అయితే ప్రభుత్వం దాదాపుగా తన “స్లీపింగ్ పార్టనర్” లాగా ఉందని అన్నారు. ప్రభుత్వం మాత్రమే జీఎస్టీ, ఐజీఎస్టీ, స్టాంప్ డ్యూటీ, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ నుంచి ప్రభుత్వం బాగానే ఆదాయాన్ని గడిస్తోందని అన్నారు.


స్టాక్ బ్రోకర్ అడిగిన ప్రశ్నకి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. స్లీపింగ్ పార్టనర్ ఇక్కడ కూర్చుని సమాధానం చెప్పలేదని చమత్కరించారు. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించేందుకు క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి)తో కలిసి పనిచేయాలని బిఎస్‌ఇకి మంత్రి విజ్ఞప్తి చేశారు.