Current Date: 26 Nov, 2024

‘త్వరలో వదినమ్మ రాబోతుంది’ అంటూ ప్రభాస్‌ పోస్ట్‌

రెబల్‌ స్టార్‌, పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ తాజాగా ‘డార్లింగ్స్‌.. ఫైనల్లీ వెరీ స్పెషల్‌ పర్సన్‌ జీవితంలోకి ఎంటర్‌ కాబోతుంది. వెయిట్‌ చేయండి’ అంటూ ఎక్స్‌లో పెట్టిన పోస్ట్‌ తెగ వైరల్‌ అవుతోంది. ఇక ఈ పోస్ట్‌ పై నిమిషాల్లోనే మిలియన్‌కు పైగా అభిమానులు స్పందించారు. ఫైనల్‌గా వదినమ్మ రాబోతుందిరా అనుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక మరికొందరు ఇంకా నమ్మలేకపోతున్నారు. అన్న వచ్చి ‘మళ్లీ ఎకౌంట్‌ హ్యాక్‌ అయిందని చెప్తాడేమో.. స్పెషల్‌ పర్సన్‌ అనేది ఏమీ ఉండదు’ అని చెప్తున్నారు. మొత్తానికి ఈ మ్యాటర్‌ ప్రజెంట్‌ టాక్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ కాగా ఇంకొందరు ఏదైనా మూవీ అప్‌ డేట్‌ అయి ఉంటుందని కామెంట్స్‌ చేస్తున్నారు.