2026 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్ జట్టు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. జింబాబ్వేతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో విండీస్ 107 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్, షిమ్రాన్ హెట్‌మైర్ (34 బంతుల్లో 85) మెరుపు ఇన్నింగ్స్‌తో 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య చేధనలో జింబాబ్వేను 147 పరుగులకే కట్టడి చేసి, +5.350 నెట్ రన్ రేట్‌తో గ్రూప్-1లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈ విజయం టీమిండియా సెమీస్ ఆశలపై నీళ్లు చల్లేలా కనిపిస్తోంది. ఇప్పటికే సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఓడిపోయిన భారత్ రన్ రేట్ (-3.800) ప్రస్తుతం అట్టడుగున ఉంది. గ్రూప్‌లో విండీస్, సౌతాఫ్రికా చెరో రెండు పాయింట్లతో మెరుగైన రన్ రేట్ కలిగి ఉండటంతో, భారత్ తన తదుపరి రెండు మ్యాచ్‌ల్లో (జింబాబ్వే, వెస్టిండీస్) భారీ తేడాతో గెలవాల్సి ఉంది. కేవలం గెలవడమే కాకుండా, ఇతర జట్ల ఫలితాలు కూడా భారత్‌కు అనుకూలంగా రావాలి. ముఖ్యంగా వెస్టిండీస్ జట్టు ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తుంటే సెమీస్ చేరడం వారికి నల్లేరు మీద నడకలా కనిపిస్తోంది. మరోవైపు సౌతాఫ్రికా కూడా బలమైన స్థితిలో ఉంది. భారత్ సెమీస్ చేరాలంటే జింబాబ్వేపై గెలిచి, ఆఖరి పోరులో విండీస్‌ను భారీ ఓడించాలి. అదే సమయంలో సౌతాఫ్రికా తన మిగిలిన మ్యాచ్‌ల్లో ఓడిపోతేనే భారత్‌కు అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా, విండీస్ సాధించిన ఈ భారీ విజయంతో టీమిండియా సెమీస్ దారి అత్యంత క్లిష్టంగా మారింది.