Current Date: 13 Aug, 2026

జగన్ పర్యటనలో ర్యాలీకి అనుమతి లేదు: కర్నూల్ SP

YCP అధినేత జగన్ కర్నూలు పర్యటనలో MLA విరూపాక్షితో ములాఖత్‌కు మాత్రమే అనుమతి కోరారని జిల్లా SP విక్రాంత్ పాటిల్ తెలిపారు. సభలు, ర్యాలీలు, రోడ్‌షోలకు ఎలాంటి పర్మిషన్ లేదని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టంచేశారు. కాన్వాయ్ వాహనాలకు బందోబస్తు కల్పిస్తామని చెప్పారు. 12.30PMకు ములాఖత్ అవుతారని వెల్లడించారు. కాగా జైలులో ఉన్న విరూపాక్షిని కలిసి, ఆయన ఫ్యామిలీని జగన్ పరామర్శించనున్నారు