Current Date: 13 Aug, 2026

పందులతో..కాయ్ రాజా కాయ్!

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పుడో వెరైటీ బెట్టింగ్ కలకలం రేపుతోంది. పందుల పేరిట పందాలు కాస్తూ కాయ్ రాజా కాయ్ అంటున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లోంక్ ఎరుకల యువత పరిస్థితి దారుణంగా ఉందని ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. వారికి ఎరుకల సమస్యలపై ఆలోచన ఉండదు గానీ పందుల బెట్టింగ్ పైనే రోజంతా దృష్టి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరుకల ఉధ్యోగ, ఉపాధి, భవిష్యత్తు, ఎరుకల జాతి ఆత్మగౌరవం కోసం కనీస సృహ లేదని పందుల బెట్టింగ్ తోనే రోజంతా గడిపేస్తూ పెడదోవ పడుతున్నారని చెబుతున్నారు. 
ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే పేకాట, క్రికెట్ కంటే ఎక్కువగా పందుల జూదానికే వీరంతా ప్రాధాన్యమిస్తున్నారని, అప్పులు చేసి మరీ రూ. లక్షలకు లక్షలు పందులపై పందెం కాస్తున్నారం టున్నారు. విచిత్రం ఏమిటంటే ఇక్కడ ఓడేది, గెలిచేదీ ఎరుకల కుటుంబమేనని, తినటానికి తిండి లేకపోయినా పందుల బెట్టింగ్ కు సొమ్ము పోస్తుంటారంట. పందెం రాయుళ్ల కోసం ప్రత్యేకంగా కొన్ని వాట్సాప్ గ్రూప్ లు కూడా హాల్ చల్ చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసుల ఉదాశీనత వల్లే ఈ పందుల పందెం అనే జూదం విశృంఖలంగా పెరిగిపోతోందని భోగట్టా. అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.