కాకినాడ .న్యూస్ లీడర్.
కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం పి మల్లవరం గ్రామపంచాయతీ పరిధిలో పత్తికొంది గ్రామానికి చెందిన మోకా దుర్గాప్రసాద్, నాగలక్ష్మి కుటుంబానికి చెందిన నలుగురు ఆడపిల్లలు కి "తల్లికి వందనం " సోమవారం ఉదయం డబ్బులు పడ్డాయి అని తల్లిదండ్రులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా టిడిపి మండల అధ్యక్షుడు వెంకటరమణ (బాబీ ), మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకరణ శుద్ధిగా తల్లికి వందనం పట్ల పనిచేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఎకౌంట్లో తల్లికి వందనం డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు.