Current Date: 10 Aug, 2026

ముద్దగా మార్చిన బంగారాన్ని మలద్వారంలో చొప్పించుకుని అక్రమ

రవాణాకు పాల్పడుతున్న 24 ఏళ్ల యువకుడిని అరెస్టు చేసినట్లు ఆదివారం అధికారులు వెల్లడించారు. అతని మలద్వారం నుంచి రూ.65.69 లక్షల విలువైన 467.09 గ్రాముల బంగారం ముద్దను స్వాధీనం చేసుకున్నామన్నారు. దాన్ని కడ్డీగా మార్చగా 422.83 గ్రాములకు చేరిందన్నారు. ఖతార్ ఎయిర్వేస్కు చెందిన విమానంలో నిందితుడు సర్ఫరాజ్ మాలా జెడ్డా నుంచి అహ్మదాబాద్ చేరుకున్నట్లు వెల్లడించారు.