Current Date: 26 Nov, 2024

హోం మంత్రి అనిత‌ని బలిచేస్తున్నారా? మొన్న బాబు, నేడు పవన్

పవన్ కళ్యాణ్ నోటి వెంట మాటలు కూడా ఊరికే అనాలోచితంగా రావు. వినడానికి లేదా చూడ్డానికి ఏదో ఫ్లో లో మాట్లాడేసినట్లు వుంటాయి. నిన్న హోం మంత్రి అనితకు చిన్న హెచ్చరికలాంటిది చేశారు. కాస్త బాధ్యతతో వ్యవహరించాలని చురకలు అంటించారు. వాస్తవానికి హోం మంత్రి అనితకి ఇలా వార్నింగ్ రావడం ఇది రెండోసారి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఒకసారి సుతిమెత్తగా హెచ్చరించారు. రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు బాగా పెరిగాయి. జ‌నం వీటి గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇది కాస్తా నేరుగా కూటమి దృష్టి వెళ్లింది. దాంతో దిద్దుబాటు చర్యలకి దిగినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో హోం మంత్రి అనితని బాధ్యురాల్ని చేయాలని కూటమి ప్రభుత్వం చూస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రజ‌ల్లో ఇప్పటికే శాంతి భద్రతల విషయంలో వ్యతిరేకత కనిపిస్తోంది.దాంతో ఈ వైఫల్యం మొత్తం హోం మంత్రి ఖాతాలో వేయాలని ప్లాన్ చేసారా? అందులో భాగంగానే పవన్ నోటి వెంట ఈ మాటలు వచ్చాయా? మరి చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Share