Current Date: 07 Nov, 2024

తెలుగు వారిపై నోరుజారి.. వివాదంలో చిక్కుకున్న నటి కస్తూరి

నటి కస్తూరి నోరుజారి వివాదంలో చిక్కుకుంది. తమిళనాడులో జరిగిన ఓ మీటింగ్‌లో తెలుగు వారిని చులకనగా చేస్తూ మాట్లాడింది. దాంతో.. ఇప్పుడు ఆమె కెరీర్ ప్రమాదంలో పడింది. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తమిళనాడుకు తెలుగు వారు వచ్చారని కస్తూరు కామెంట్స్ చేసింది. తమిళనాడుకి అలా వచ్చిన వారంతా ఇప్పుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆమె కామెంట్‌ చేసింది. అలానే ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరు..? అని ఆమె ప్రశ్నించడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు మండిపడుతున్నారు. హిందూ పీపుల్స్ పార్టీ ఆఫ్ తమిళనాడు తరపున బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ నటి కస్తూరి పైవిధంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ వ్యాఖ్యలతో వివాదం రాజుకోవడంతో కస్తూరి దిద్దుబాటు చర్యలకి దిగింది. 'నేను తెలుగు వారికి వ్యతిరేకంగా మాట్లాడాను అంటూ డీఎంకే పార్టీకి చెందిన వారు ఫేక్‌ ప్రచారాలకు తెరలేపారు. తెలుగు గడ్డ నా మెట్టినిల్లుతో సమానం. తెలుగు ప్రజలందరూ నా కుంటుంబం అనే భావిస్తాను’’  

Share