తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 07తో ఏడాది గడుస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా.. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి.. రేవంత్ రెడ్డి సర్కార్ నుంచి రాష్ట్రంలోని పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందించనున్నారు. అందులో భాగంగా.. మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నాయుకుడు కేసీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం అందించనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేసీఆర్‌తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్‌కు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ తరపున అధికార ఆహ్వానం అందించనున్నట్టు తెలిపారు.ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా.. సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త రూపంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయం ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేపిస్తున్నారు.
Share