Current Date: 13 Mar, 2025

పుష్ప 2లో అసలు డైలాగ్ కంటే.. ఫేక్ డైలాగ్‌‌‌ వైరల్

మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ పుష్ప 2 మూవీతో పీక్స్‌కి చేరిపోయింది. ఏపీ ఎన్నికల సమయంలో మొదలైన ఈ చిచ్చు.. పుష్ప 2 తర్వాత తీవ్రంగా మారిపోయింది. ఎంతలా అంటే పుష్ప 2లో అసలు డైలాగ్‌ను లేపేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్.. ఫేక్ డైలాగ్‌తో మెగా ఫ్యామిలీకి వార్నింగ్ ఇస్తున్నారు. పుష్ప 2లో అసలు డైలాగ్ ఏంటంటే.. ఎర్రచందనం దుంగలతో కలిసి కంటైనర్‌లో దాక్కుని జపాన్‌కి వెళ్లిన పుష్ప రాజ్ (అల్లు అర్జున్‌)ని గమనించిన అక్కడి స్మగ్లర్ తలకిందులుగా వేలాడదీస్తాడు. దాంతో.. విలన్‌ని ఉద్దేశిస్తూ ‘‘మామూలుగా చూస్తే నీ బాస్ కనిపిస్తాడు. ఇలా తలకిందులుగా చూస్తేనే నీ బాసులకే బాస్ కనిపిస్తాడు. నేనేరా నీ బాస్. పుష్పే.. బాస్. భూగోళంలో ఏడున్నా సరే, నీ యవ్వ తగ్గేదేలే..” అంటూ ఓ డైలాగ్ చెబుతాడు. ఈ డైలాగ్‌ను కొంత మంది పూర్తిగా మార్చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇంతకీ ఏమని మార్చారంటే.. “ఎవడ్రా బాస్, ఎవడికిరా బాస్. ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్” అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తున్నారు. 

Share