సాధారణంగా ప్రతి ఊరుకి ఓ షార్ట్ కట్ నేమ్ ఉంటుంది. అసలైన పేరుకంటే నోటికి పలికే ఆ పేరునే జనాలు పలుకుతుంటారు. కాని విశాఖ పట్ణం పేరు కాస్త వైజాగ్ అవ్వడం వెనుక చిత్రమైన కారణాలు ఉన్నాయి. తెలుగు పండితులు తెలిపిన వివరాల ప్రకారం తెలుగు భాషలో ఏ పేరుకైనా పొల్లు(న్,ర్,క్) అక్షరాలు ఉండవు. శతాబ్దాల క్రితం రాజులు పరిపాలించినప్పుడు కూడా ఊరి పేర్లు, మనుషుల పేర్లకు పొల్లు ఉండేవి కాదని తెలుస్తోంది. అప్పట్లో వారు రాసిన శాసనాల ద్వారా ఈ విషయం బయటపడింది. అయితే బ్రిటీష్ పరిపాలన మొదలైనప్పటి నుంచి పేర్లలో చాలా మార్పులు వచ్చాయి. ఆంగ్లేయులకు నోరు తిరగక, పలకడం రాక చాలా పేర్లు మార్చేశారు. విశాఖ పట్టణానికి ఆ పేరు రావడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం పరమేశ్వరుడి కుమారుడు కుమార స్వామికి విశాఖ పట్టణంలో అప్పట్లో గుడి ఉండేదట. స్వామి వారి నక్షత్రం కూడా విశాఖే కావడంతో విశాఖ పట్టణంగా పిలిచే వారని కథనాలు చెబుతున్నాయి. విశాఖ ప్రాంతాన్ని కళింగ రాజులు పాలించారు. అశోకుడు బౌద్ధ మతం తీసుకున్నాక ఈ ప్రాంతంలో బౌద్ధ బిక్షువులు ఎక్కువగా సంచరించేవారు.
Share