గల్ఫ్ దేశాలపై ఇరాన్ నిర్వహించిన క్షిపణి, డ్రోన్ దాడుల్లో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రతిష్టాత్మక బుర్జ్ అల్ అరబ్ హోటల్‌కు స్వల్ప నష్టం వాటిల్లినట్లు వార్తలు వస్తున్నాయి. రాత్రి జరిగిన ఈ ఘటనలో విమానాశ్రయ టెర్మినల్‌లో ఒక భాగం దెబ్బతినగా, నలుగురు గాయపడ్డారని దుబాయ్ మీడియా ఆదివారం తెలిపింది. విమానాశ్రయంలో జరిగిన ఘటనను మొదట ‘ఇన్సిడెంట’గా మాత్రమే పేర్కొన్న అధికారులు, తర్వాత డ్రోన్‌ను అడ్డుకుని కూల్చివేయడంతో దాని ముక్కలు పడి చిన్నపాటి అగ్నిప్రమాదం సంభవించిందని వెల్లడించారు. అదే సమయంలో, బుర్జ్ అల్ అరబ్ హోటల్ బాహ్య గోడపై డ్రోన్ శకలాలు పడటంతో అక్కడ కూడా స్వల్పంగా మంటలు చెలరేగినట్లు తెలిపారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిసింది.
Share