Current Date: 16 Nov, 2024

గ్రౌండ్‌లో గొడవ ఇన్‌స్టాలో రివేంజ్ తీర్చుకున్న విరాట్ కోహ్లీ

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఏడేళ్ల క్రితం జరిగిన టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా ప్లేయర్లు తెగ ఆటపట్టించారు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ జారి పడిపోగా అతని భుజానికి గాయమైంది. దాంతో కోహ్లీ నొప్పితో భుజం పట్టుకున్న తీరుని కాపీ కొడుతూ మైదానంలో ఆస్ట్రేలియా ప్లేయర్లు ట్రోల్ చేశారు.మైదానంలో ఆస్ట్రేలియా ప్లేయర్లు తనని అవమానించడంతో కోహ్లీ కోపంతో ఊగిపోయాడు. మరీ ముఖ్యంగా.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌పై కోపం తెచ్చుకుని ఇన్‌స్టాలో అతడ్ని బ్లాక్ చేశాడు. అనూహ్యంగా నాలుగేళ్ల తర్వాత కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరులో టీమ్‌లోకి ఐపీఎల్‌లో ఆడేందుకు మాక్స్‌వెల్ వచ్చాడు.ఆర్సీబీలోకి రాగానే ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీని ఫాలో అవుదామని మాక్స్‌వెల్ ప్రయత్నించినా.. అతని కోహ్లీ అకౌంట్ దొరకలేదట. దాంతో కోహ్లి దగ్గరికెళ్లి నన్ను బ్లాక్‌ చేశావా అని అడగ్గా అవును అని కోహ్లీ నవ్వుతూ సమాధానమిచ్చాడు. ఆ తర్వాత అన్‌బ్లాక్ చేయగా.. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యామని మాక్స్‌వెల్ తాజాగా తన పుస్తకంలో రాసుకొచ్చాడు.

Share