Current Date: 16 Nov, 2024

ఆస్తి వివాదంలో ఒంటరైపోయిన వైయస్ జగన్ షర్మిలకే విజయమ్మ ఓటు

మాజీ సీఎం వైయస్ జగన్ ఆస్తుల వివాదంలో ఒంటరి అయిపోయారు. ష‌ర్మిల మాట‌నే తన మాటగా విజ‌య‌మ్మ గ‌ట్టిగా స‌మ‌ర్థించారు. ఆస్తుల పంప‌కంలో త‌న కూతురు ష‌ర్మిల‌కు అన్యాయం జ‌రిగింద‌ని, అందుకే ఆమె ప‌క్షాన నిలిచిన‌ట్టు విజ‌య‌మ్మ స్ప‌ష్టం తాజాగా రాసిన లేఖలో స్పష్టం చేసేశారు. ష‌ర్మిల ఇద్ద‌రు పిల్ల‌లు, అలాగే జ‌గ‌న్ ఇద్ద‌రి పిల్ల‌ల‌కు స‌మానంగా ఆస్తులు పంప‌కం చేయాల‌నేది వైఎస్సార్ ఆజ్ఞ‌గా విజ‌య‌మ్మ అందులో పేర్కొన్నారు.‘నేను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా, జరగకూడనివన్నీ నా కళ్ళముందే జరుగుతున్నాయి. ఈ కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి అసత్యాలు చెప్పారు. వైయస్‌ఆర్ బతికి ఉండగానే ఆస్తులు పంచేశారని అన్నారు. ఇది అవాస్తవం.వైఎస్ఆర్ పిల్లలిద్దరూ పెరుగుతున్న రోజుల నుంచి కొన్ని ఆస్తులు పాప పేరు మీద.. అలాగే కొన్ని ఆస్తులు జగన్ పేరు మీద పెట్టారు. అది ముమ్మాటికీ ఆస్తులు పంచడం కాదు. ఎంవోయూలో ఉన్న సరస్వతి షేర్స్ 100 శాతం, ఎలహంక ప్రాపర్టీ 100 శాతం పాపకు వెంటనే ఇస్తానని జగన్ అప్పుడే మాట ఇచ్చి సంతకం పెట్టాడు. ఇవి కూడా ఇవ్వకుండా.. ఆటాచ్మెంట్లో లేని ఆస్తుల విషయంలోనూ పాపకు అన్యాయం జరిగింది. పాప భాగానికి వచ్చిన భారతి సిమెంట్స్, సాక్షి మీడియా, వైఎస్ఆర్ ఇల్లు.. ఇలాంటివి కేసుల తర్వాత ఇవ్వాల్సి ఉంది’’ అని విజయమ్మ లేఖలో రాసుకొచ్చారు

Share