ఏఎన్నార్ నేషనల్ అవార్డు వేడుక ఘనంగా జరిగింది. ఏఎన్నార్ నేషనల్ అవార్డుని అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అక్కినేని ఫ్యామిలీ సమక్షంలో మెగాస్టార్ చిరంజీవికి అందించారు. అయితే ఈ ఈవెంట్ కు కాబోయే అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ కూడా హాజరైంది. ఈ ఈవెంట్లో శోభితనే హైలెట్ గా నిలిచింది. అందరి కళ్ళు కాబోయే జంటపైనే ఉన్నాయి. ఇక నాగచైతన్య, నాగార్జున, అక్కినేని ఫ్యామిలీ శోభితను పలువురు ప్రముఖులకు, ఈవెంట్ కి వచ్చిన గెస్టులకు పరిచయం చేసారు. ఈ క్రమంలో నాగార్జున చిరంజీవిని పిలిచి మరీ శోభితను పరిచయం చేసారు. చిరంజీవి శోభితతో మాట్లాడారు.
Share